కడప జిల్లాలో మరో విశ్వవిద్యాలయం
హైదరాబాద్: మెదక్ ఐఐటికి రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. భూసేకరణకు ఈ నిధులు విడుదల చేశారు. మెదక్ ఐఐటికి సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒక లేఖ రాయనున్నారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక విద్యపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
కడప జిల్లాలో 700 ఎకరాల్లో ప్రపంచస్థాయి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం మంత్రి ఆర్. చెంగారెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని నన్నయ విశ్వవిద్యాలయానికి భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications