ప్రచారం తీరుపై వైయస్ అసంతృప్తి

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం తీరుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో వెనకబడి పోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ లోకసభ, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గం నాయకులతో ఆయన సోమవారం టెలిఫోనులో మాట్లాడారు.

కరీంనగర్ లోకసభ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో, మంత్రి రత్నాకర్ రావుతో, సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావుతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఏదో ఒక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో టెలిఫోనులో మాట్లాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+