తిరుపతిలో ఆటో డ్రైవర్ హత్య
తిరుపతి: తిరుపతిలో వేణుగోపాల్ అనే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించినందుకు వేణుగోపాల్ ను జగ్గు అనే రౌడీ షీటర్ మనుషులు హత్య చేశారు. తిరుపతిలో ఆటో స్టాండులో జగ్గు, అతని అనుచరులు నిత్యం మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి వారు మామూళ్ల వసూలుకు దిగారు. కొత్తగా కొన్న ఆటోకు 5000 రూపాయలు, ప్రతి నెలా 250 రూపాయల చొప్పున జగ్గుకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. డబ్బులతో అతను అధికారులను, పోలీసులను సంతోషపెడుతూ నిరాటంకంగా తన పని కొనసాగించుకుంటూ పోతున్నాడు.
వేణుగోపాల్ అనే యువకుడు కొత్తగా ఆటో కొనుక్కున్నాడు. జగ్గు మనుషులు అతని వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. అందుకు వేణుగోపాల్ నిరాకరించాడు. దాంతో జగ్గు మనుషులు అతన్ని ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. స్పృహ తప్పి పడిపోయిన వేణును జగ్గు మనుషులు ఇంటి వద్ద పడేసి పోయారు. గురువారం తెల్లవారున అతను మరణించాడు. తమ కుటుంబానికి అతనే ఆధారం కావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications