ఆ ఇద్దరిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య, శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు ఒప్పుకోకపోతే వారిద్దరిని సస్పెండ్ చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించింది. వేర్వేరు అంశాలపై వీరిద్దరు చాలా కాలంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై చాలా కాలంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసేందే. వారిద్దరికీ త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేసిన విమర్శలు పార్టీని బలహీనపరిచేవిగా ఉన్నాయని పార్టీ అధిష్ఠానవర్గం అభిప్రాయపడింది.
ఉప్పునూతల, హరిరామజోగయ్య విమర్శల వల్ల పార్టీకి కష్టాలు ఎదురవుతున్నాయని పార్టీ అధిష్ఠానవర్గం అభిప్రాయపడుతోంది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని, ముఖ్యమంత్రి అవుతారని హరిరామ జోగయ్య పదే పదే అంటున్నారు. చిరంజీవి పార్టీ పెడితే అందులో చేరుతానని, వైయస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అంటున్నారు. తెలంగాణ అంశంపై ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కాంగ్రెసుపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఆయనపై మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి వర్గం పార్టీ అధిష్ఠానవర్గం ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications