హైదరాబాద్ : ఉపఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుందామని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెరాస పార్టీ అధ్యక్ష పదవిలో కేసీఆరే ఉండాలని ప్రత్యామ్నాయం లేదని తెరాస రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్ చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని తెరాస రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశంలో చేసిన తీర్మానానికి ఆయన అంగీకరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల సమయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుందామని ఆయన అన్నారు. తనలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకుందామని పిలుపునిచ్చారు