పెట్రో పెంపుపై ఎడ్లబండి యానం

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు నిరసనగా వివిధ పార్టీల కార్యకర్తలు గురువారంనాడు వినూత్న ప్రదర్శనలు నిర్వహించారు. బిజెపి కార్యకర్తలు హైదరాబాదులోని మెహిదీపట్నంలో ఎడ్ల బండిపై ప్రయాణం చేశారు. అక్కడే వంటావార్పూ చేసుకున్నారు. కరీంనగరులోనూ వారు ఇటువంటి ప్రదర్శనే నిర్వహించారు. కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మహిళా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. రాస్తారోకోకు నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను పోలీసులు అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. వారిని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+