చీటింగ్ కేసులో తెరాస నేత అరెస్టు
హైదరాబాద్: ఒక చీటింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు గురువారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నగర నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. తెరాస హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి జహింగీర్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కోట్ల రూపాయల మేరకు ప్రజలను అతను మోసం చేసినట్లు ఆరోపణ.
లక్షకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి జహీంగీర్ పాషా వందా, వందా యాభై మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఆ విధంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications