అటవీ భూములపై హక్కులు: వైయస్

YS Rajasekhar Reddy
గుంటూరు: అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలల్లో గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామని, ఒక్కొక్కరికి పది ఎకరాలకు మించకుండా హక్కుల కల్పిస్తామని ఆయన చెప్పారు.

తాము అధికారంలో ఉన్నన్ని నాళ్లు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు. కరువు కోరల్లో చిక్కుకున్న భూములను సస్యశ్యామలం చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రశంసలతో ముంచెత్తారు. ఆహార ఉత్పత్తిలో భారతదేశంలో రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. జలయజ్ఞం పూర్తయితే రాష్ట్రం దేశ ధాన్యాగారంగా మారుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+