ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం: సోనియా

Sonia Gandhi
నెల్లూరు: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర ప్రాంతాలకు మార్గం చూపుతుందని ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కృష్ణపట్నం నౌకాశ్రయం ఈ రీతిన నిర్మితం కావడం, ఇంతకు ముందు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు కావడం ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయని ఆమె అన్నారు. కృష్ణపట్నం నౌకాశ్రయం మొదటి దశను ఆమె గురువారం జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పరిశ్రమలు పెద్దయెత్తున ఏర్పాటవుతున్నాయని, విద్యుత్ ప్లాంట్ కూడా వస్తోందని, దీని వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆమె అన్నారు.

ఆర్థిక పురోగతిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో కూడా ముందుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె కృష్ణపట్నం థర్మల్ విద్య్తుత్తు కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+