అజిత్ సింగ్ తో బర్దన్ భేటీ

వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. అణు ఒప్పందంపై వామపక్షాల వైఖరిని బర్దన్ అజిత్ సింగ్ కు వివరించారు. తాను వామపక్షాల వైఖరిని, పరిస్థితిని వివరించానని, అజిత్ సింగ్ తన వైఖరి చెప్పారని, నిర్ణయం తీసుకోవడం ఆర్ఎల్డీకి అంత సులభం కాదని బర్దన్ విలేకరులతో అన్నారు. అనుభవజ్ఞుడు, పాత మిత్రుడు అయిన బర్దన్ తాజా రాజకీయాల గురించి వివరించారని, తాను ఈ విషయాలపై తన పార్టీ సహచరులతో మాట్లాడుతానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. అజిత్ సింగ్ తన నిర్ణయం తాను తీసుకుంటారని బర్దన్ అన్నారు. బర్దన్ కొన్ని కొత్త విషయాలు చెప్పారని, ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదని అజిత్ సింగ్ అన్నారు.
తాను మాయావతితో మాట్లాడలేదని, అణుశక్తికి తాను వ్యతిరేకమని, అయితే అణు ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ఆలస్యంగానైనా సరే సరైన నిర్ణయం తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications