జర్నలిస్టులపై మల్కన్ గిరి పోలీసుల ప్రతాపం
మల్కాన్ గిరి: మావోయిస్టుల మందుపాతర ఘటనపై కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మల్కాన్ గిరి పోలీసులు విరుచుకుపడ్డారు. అత్త మీది కోపం దుత్త మీది చూపినట్లుగా వారు మావోయిస్టులపై కోపాన్ని జర్నలిస్టులపై చూపించారు. మల్కాన్ గిరి పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) కార్యాలయం ఆవరణలోనే జరిగింది. కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులకు పోలీసు అధికారులు ముఖంయ చాటేశారు. అనంతరం ఒక్కసారిగా పోలీసులు వారిపై విరుచుకుపడి లాఠీచార్జీ చేశారు.
పోలీసుల చర్యతో జర్నలిస్టులు చెల్లాచెదురయ్యారు. జర్నలిస్టుల కెమెరాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలో మావోయిస్టులు పోలీసులు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో 17 మంది పోలీసులు మరణించారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications