కాంగ్రెస్ ఎంపిల ఇళ్ల ముందు ధర్నాలు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానవర్గాన్ని ఒప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కార్యకర్తలు గురువారంనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఇళ్ల ముందు ధర్నాకు దిగారు. ఈ నెల 22వ తేదీన యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒత్తిడి తేవాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగిన తెరాస శాసనసభ్యుడు నగేష్ ను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ ఇంటి ముందు ధర్నాకు దిగిన తెరాస నాయకుడు నాయని నర్సింహారెడ్డిని, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

నిజామాబాద్ లోని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ ఇంటి ముందు తెరాస కార్యకర్తలు ధర్నాకు దిగారు. అక్కడే వంటావార్పూ చేసుకున్నారు. నిర్మల్ లోని ఇంద్రకరణ్ ఇంటి ముందు కూడా తెరాస నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తన ఇంటి ముందు ధర్నాకు దిగిన తెరాస కార్యకర్తలతో సర్వే సత్యనారాయణ మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. అయితే తెరాస కార్యకర్తలు ఆయనతో వాదనకు దిగారు. ప్రధాని చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. అలా చేస్తే తమ పార్టీ ఎంపీలు యుపిఎకు ఓటు వేస్తారని వారు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకాచౌదరి, జి. వెంకటస్వామి ఇళ్ల ముందు కూడా తెరాస కార్యకర్తలు ధర్నాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+