దేశ భద్రతపై రాజీ పడం: సోనియా

ఆర్థిక పురోగతిలో, బడుగులకు సామాజిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది అగ్రస్థానమని సోనియా గాంధీ ప్రశంసించారు. నెల్లూరులో ఆరోగ్యశ్రీ రెండు, మూడు దశల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ప్రారంభించిన అనంతరం ఆమె గురువారం ఎసి మైదానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె అన్నారు. మీరు బాగున్నారా అని ఆమె తెలుగులో ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడాన్ని ఆమె అభినందించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకం వల్ల రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఆమె అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు ఎన్. జనార్దన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications