నన్ను ఎగతాళి చేశారు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తన ప్రభుత్వ హయాంలో విజన్ 2020 ప్రకటిస్తే ఎగతాళి చేశారని, ఇప్పుడు దాన్నే అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. పనులు చేయకుండా వజ్రకరూర్ బ్యాంకు నుంచి ఐదు కోట్ల రూపాయల డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల ద్వారా పాలనలో పారదర్శకతను పెంచామని, అధికారులను, అనధికారులను ప్రజలు ప్రశ్నించే వాతావరణం కల్పించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+