ఎన్నికల్లో పోటీ చేయను: జోగయ్య
హైదరాబాద్: తాను వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి ఆదివారం సాయంత్రం పంపారు. తాను చిరంజీవి పార్టీలో పనిచేస్తానని ఆయన చెప్పారు. తాను మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నానని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన విషయంలో తాను తన వైఖరికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని ఆయన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications