యుఎన్ జోక్యానికి హురియత్ వినతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వేర్పాటువాద నాయకులు సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. హురియత్ కాన్ఫరెన్స్, ఇతర సంస్థలు తలపెట్టిన ర్యాలీలో పాల్గొనడానికి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు జావిద్ అహ్మద్ మీర్, జాఫర్ అబర్ భట్ ఐక్యరాజ్య సమితి స్థానిక కార్యాలయంలోని సైనిక పరిశీలకుల గ్రూప్ నకు వినతిపత్రం సమర్పించారు.
మీర్, భట్ లను దాదాపు వంద మంది మద్దతుదారులు అనుసరించారు. సోనాపూర్ లోని యుఎన్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. బస్సుల్లో, కార్లలో, మోటార సైకిళ్లపై అక్కడికి చేరుకోవడానికి ప్రజలు పోలీసు బారికేడ్లను ఛేదించారు. స్వయం నిర్ణయాధికార హక్కును భారత్ తమకు కల్పించేలా, దుర్మార్గమైన బలగాలను తమపై ప్రయోగించకుండా జోక్యం చేసుకోవాలని వారు యుఎన్ ను కోరారు.












Click it and Unblock the Notifications