జైపూర్ పేలుళ్లు: వైద్య విద్యార్థి అరెస్టు
జైపూర్: జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో అరెస్టు చేశారు. మే 13వ తేదీన జైపూర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో 65 మంది మరణించిన విషయం తెలిసిందే. పేలుళ్లకు వాడిన అమ్మోనియం నైట్రేట్ ను ఎస్ఎంఎస్ వైద్యవిద్యార్థి అబ్రార్ అలీ సరఫరా చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 16వ తేదీన అరెస్టయిన సాజిగ్ మన్సూరి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అలీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన 9 మంది సిమి కార్యకర్తల్లో సాజిగ్ మన్సూరి ఉన్నాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అరెస్టయినవారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైపూర్ పేలుళ్లకు సంబంధించి జైపూర్ పోలీసులు ఆదివారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిలో ఇద్దరు సిమి కార్యకర్తలున్నారు.












Click it and Unblock the Notifications