చిరు పార్టీలో దళిత కవి కత్తి
హైదరాబాద్: ప్రముఖ దళిత కవి కత్తి పద్మారావు సోమవారం చిరంజీవి పార్టీలో చేరారు. దళిత మహాసభ నాయకుడిగా పలు ఉద్యమాలు నడిపిన కత్తి పద్మారావు గుంటూరు జిల్లాకు చెందినవారు. ఆయన పలు కవితా సంకలనాలు, విమర్సనా వ్యాసాల గ్రంథాలు వెలువరించారు. గతంలో ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చారు.
ఇదిలా ఉంటే, తెలుగుదేశం నాయకురాలు వంగా గీత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె చిరంజీవి పార్టీలో చేరే అవకాశం ఉంది. వంగా గీత తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు కూడా వెళ్లారు.












Click it and Unblock the Notifications