ముషార్రఫ్ రాజీనామా ప్రకటన

Pervez Musharraf
ఇస్లామాబాద్: తన రాజీనామా ఈ సాయంత్రం జాతీయ అసెంబ్లీ స్పీకర్ కు చేరుతుందని పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ చెప్పారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తానని ఆయన అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. 9 ఏళ్ల పాలనలో ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కున్నానని ఆయన చెప్పారు. ఇవాళ తనకు కీలకమైన రోజు అని, ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించే ముందు అన్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భగవంతుడు తన వెంటే ఉన్నాడని ఆయన అన్నారు.

దేశం కోసం తాను రెండు యుద్ధాలు చేశానని, దేశంపై ఉన్న ఉగ్రవాద ముద్రను తొలగించడానికి ప్రయత్నించానని ఆయన అన్నారు. దేశసేవ కోసం ఇప్పటికీ ఉత్సాహంగా ఉన్నానని ఆయన చెప్పారు. అభిశంసనను ఎదుర్కోవడం తన హక్కు అని ఆయన అన్నాను. ప్రభుత్వ చార్జిషీట్ తప్పుల తడక అని, చార్జిషీట్ ను ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. తనకు అన్నిటి కన్నా ముఖ్యం పాకిస్తాన్ అని ఆయన అన్నారు. తానూ మామూలు మనిషినే అని, సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని తప్పులు చేసి ఉంటానని ఆయన అన్నారు. పాక్ ను ప్రపంచంలో తలెత్తుకునేలా చేశానని ఆయన అన్నారు. తన పాలనలో దేశం సుభిక్షంగా ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+