న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించారు. చిరంజీవి పార్టీ వల్ల పార్టీపై పడే ప్రభావాన్ని ఆయన సోనియా గాంధీకి వివరించినట్లు సమాచారం. ఆయన సోమవారంనాడు సోనియా గాంధీని కలుసుకున్నారు.
సోనియాను ఆయన రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. సెప్టెంబర్ లో కడప జిల్లాలో తలపెట్టిన వివిధ కార్యక్రమాలకు ఆయన సోనియాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా రాజశేఖర రెడ్డి కలుసుకున్నారు.