నెల్లూరు: ప్రముఖ నిర్మాత,భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాలరెడ్డి భౌతిక కాయాన్ని చూసి బాలకృష్ణ కన్నీళ్ళు పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా వాకాడ మండలం పంబలి గ్రామానికి ఆయన మృత దేహం చేరుకుంది. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడికి పలువురు సినీ ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికేందుకు చేరుకుంటున్నారు. మంగమ్మ గారి మనవడు,మువ్వ గోపాలుడు,ముద్దుల మావయ్య,ముద్దుల కృష్ణయ్య వంటి ఎన్నో హిట్ చిత్రాలను తనతో రూపొందించిన గోపాలరెడ్డి మృత దేహాన్ని చూసి తట్టుకోలేక బాలకృష్ణ చలించిపోయారు.