ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం : మందక్రిష్ణ
హైదరాబాద్ : మాదిగ దండోరా రథయాత్రను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం నుండి ప్రారంభిస్తామని ఎమ్మార్పీస్ అధినేత మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల చట్టబద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమస్య పరిష్కారం కాకుంటే అక్టోబర్ 10న ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. అప్పటికీ తమ డిమాండ్లను నెరవేర్చకుంటే నవంబర్ 15న హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణపై ముఖ్యమంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అన్నారు. ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు రోడ్‌షోలు నిర్వహిస్తామని మందకృష్ణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications