దసరా కానుకగా...నానో కారు
ముంబయి:అ౦దరూ ఎ౦తో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న నానో కారును ఎట్టి పరిస్దితుల్లోనైనా దసరా నాటికి మార్కెట్‌లోకి తెచ్చి తీరాలని టాటా మోటర్స్ గట్టి పట్టుదలతో ఉ౦ది. సి౦గూర్‌పై అనిశ్చితి కొనసాగుతున్న నేపధ్య౦లో నానో మార్కెట్‌లోనికి వస్తు౦దా, రాదా అన్న అనుమానాలకు తావీయరాదని, పూణేలోని తమ ప్లా౦ట్ ను౦చి తొలి విడతగా 1000 నానోలను తయారుచేసి మార్కెట్‌లో విడుదల చేయాలని రతన్ టాటా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తో౦ది.
సింగూరు వివాదం రోజురోజుకు మలుపు తిరుగుతున్న నేపథ్యంలో నానో తయారీకి పూణెలో అన్నిఏర్పాట్లు చేసినట్లు టాటా యాజమన్యం తెలిపింది. టాటా మోటార్స్ విజ్ఞప్తి మేరకు నానో కారు విడిభాగాల ఉత్పత్తిదారులందరూ పూణె ప్లాంటేకే డెలిరీలు ప్రారంభించనట్లు తెలిసింది. మరోవైపు రానున్న నాలుగు సంవత్సరాలలో టాటాలు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి పూణె ప్లాంట్ ఏ మాత్రం చాలదని కాంపోనెంట్ల సరఫరాలు అంటున్నారు. సింగూర్‌లో వాతావరణం అనుకూలిస్తే తాము సింగూరులో పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications