నిమజ్జన ర్యాలీ బాలాపూర్ గణేశుడితో మొదలు
హైదరాబాద్: రేపటి వినాయక నిమజ్జన కార్యక్రమ ర్యాలీ బాలాపూర్ వినాయకుడితో ప్రారంభమవుతుంది. ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ వినాయకుడికి ప్రఖ్యాతి ఉన్న విషయం తెలిసిందే. రేపు ఉదయం ఐదు గంటలకు పూజలు అందుకున్న తర్వాత బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు చారిత్రక చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ కు చేరుకుంటుంది.
ఈసారి బాలాపూర్ గణేశుడి కోసం ఆగ్రా స్వీట్స్ వారు ప్రత్యేక శ్రద్ధతో స్వచ్చమైన నెయ్యితో 21 కిలోల లడ్డూను తయారు చేశారు. వినాయకుడి చేతిలో లడ్డూను వేలం వేసే ఆచారం బాలాపూర్ వినాయకుడితోనే ప్రారంభమైంది. మొదటి సంవత్సరం లడ్డూ 450 రూపాయలు పలుకగా గత ఏడాది ఒకరు 4 లక్షల రూపాయలకు పాడుకున్నారు. ముస్లింలు కూడా ఈ వేలంలో పాల్గొనడం విశేషం.












Click it and Unblock the Notifications