చిరంజీవి పార్టీలో చేరిన రామచంద్రయ్య
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం నాయకుడు సి.రామచంద్రయ్య శనివారం మధ్యాహ్నం లాంచనంగా చిరంజీవి ప్రజాపార్టీలో చేరారు. ఆయన చిరుపార్టీలో చేరడం ఖరారై చాలా కాలమైనా ఈరోజు ఆయన పార్టీలో చేరినట్టు సినిమా ఫక్కీలో ఏర్పాటు చేశారు. రాయలసీమకు చెందిన రామచంద్రయ్య తొలుత చార్టర్డ్ అకౌంటెంట్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎదగగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన పెద్ద నాయకుల్లో రామచంద్రయ్య ఒకరు. ప్రజారాజ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచే ఎక్కువ మంది నాయకులు చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications