కాలిఫోర్నియాలో రైలు ప్రమాదం
లాస్ ఏంజెల్స్ :కాలిఫోర్నియాలో రెండు రైళ్ళు ఢీ కొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 50 మంది వరకూ గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్ కు ఉత్తరంగా చాట్స్ వర్త్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్యాసెంజర్ రైలు,ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పలు రైలు పట్టాలు తప్పాయి. రెలు మొదట పెట్టె పట్టాలు తప్పి ఇంజన్ను చుట్టుకుపోయింది. ఈ మధ్య కాలంలో ఇంత ప్రమాదం జరగలేదని అయితే ఇంకా కారణాలు తెలియలేదని లాస్ ఏంజెల్స్ మేయర్ తెలిపారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.












Click it and Unblock the Notifications