న్యూఢిల్లీ: డ్వాక్వా మహిళలను అప్పులు పాలు చేస్తోందన్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పరిస్ధితి చూస్తుంటే జాలి వేస్తోందని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు ఏవేవో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రేస్ పార్టీ వైపై ఉన్నారని,వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి తిరిగి అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేసారు.