న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరంజీవి రాజకీయాలపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలు అంటే నటన కాదని ఆయన మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. రాజకీయాల్లో రాణించాలంటే ధైర్యం ఉండాలని, త్యాగం చేయడానికి వెనుకాడకూడదని రాజశేఖరరెడ్డి అన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన రాజశేఖరరెడ్డి చిరంజీవి పార్టీ మీదనే మీడీయా ప్రతినిధులతో మాట్లాడడం, అది కూడా క్లుప్తంగా, సీరియస్ గా మాట్లాడడం విశేషం. గతంలో కూడా రాజశేఖరరెడ్డి రాజకీయాలంటే నటన కాదని విమర్శించడం, దానికి చిరంజీవి పార్టీ అధికార ప్రతినిధులు నిన్న తీవ్రంగా స్పందించి వైఎస్ ను విమర్శించడం తెలిసిందే.