బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి శుభలేఖ చూశారా! పేర్లు చూసి షాకయ్యారు..
టాలీవుడ్‌లో 'బ్లాక్‌బస్టర్' చిత్రాల నిర్మాతగా, తనదైన స్పీచ్‌లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో త్వరలోనే ఏడడుగులు వేయబోతోంది. మే నెలలోనే వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగగా.. ఇప్పుడు వివాహ ఘడియలు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన కుమార్తె లగ్న పత్రికను సినీ, రాజకీయ ప్రముఖులకు స్వయంగా అందజేస్తూ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డ్‌లో ఒక అరుదైన, ఆసక్తికరమైన లైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా పెళ్లి పత్రికల పైన దేవుళ్ల పేర్లు లేదా ఇంట్లోని పెద్దల పేర్లు వేయించడం చూస్తుంటాం. కానీ, బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక పైభాగంలో "శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో..." అని ప్రత్యేకంగా ముద్రించారు. నారా కుటుంబంతో బండ్ల గణేష్‌కు ఉన్న విడదీయరాని వ్యక్తిగత అనుబంధానికి ఈ శుభలేఖే నిలువెత్తు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి బండ్ల గణేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని, మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని మొక్కుకున్న బండ్ల గణేష్.. ఇటీవల షాద్ నగర్ నుంచి తిరుమల కొండకు కాలినడకన పాదయాత్ర చేసి తన మొక్కు చెల్లించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు. అంతేకాదు, గత మే నెలలో జరిగిన జనని నిశ్చితార్థానికి సైతం చంద్రబాబు దంపతులు స్వయంగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక బంధం వల్లే కుటుంబ పెద్దల స్థానంలో చంద్రబాబు దంపతుల పేర్లను ఆయన పత్రికపై వేయించారు.
సాంప్రదాయబద్ధంగా ఆహ్వానాలు.. వెన్యూ ఎక్కడంటే?
కేవలం కార్డులు ఇవ్వడమే కాకుండా, తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ.. పిలిచే అతిథులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ పట్టువస్త్రాలను బహూకరించి మరీ బండ్ల గణేష్ వివాహానికి ఆహ్వానిస్తుండటం విశేషం.
జనని, సూర్యతేజల శుభ ముహూర్తాన్ని ఆగస్ట్ 16వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల 58 నిమిషాలకు నిర్ణయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ విస్పర్ వ్యాలీలోని ప్రముఖ 'జేఆర్‌సీ (JRC) కన్వెన్షన్' హాల్‌లో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ అగ్రనేతలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్న బండ్లన్న కూతురి లగ్న పత్రిక టెక్ బజార్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ షేర్ అవుతోంది.














Click it and Unblock the Notifications