2026 లోనే అత్యంత చెత్త సినిమా.. రూ. లక్షతోనే మూవీ..కానీ 'స్పైడర్‌ మ్యాన్‌', 'ఒడిస్సీ'లను మించిన వసూళ్లు..!

ఇటీవలికాలంలో టాక్ బాగుంటేనే సినిమాలను థియేటర్లలోకి వెళ్లి చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి వచ్చేంత వరకూ వెయిట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ ముందు ప్లాఫ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. అయితే 2026 లోనే అత్యంత చెత్త సినిమాగా పేరుగాంచిన మూవీకి అద్దిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీ ఏకంగా ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్, ఒడిస్సీ సినిమాల వసూళ్లను సైతం వెనక్కు నెట్టింది. అదే చైనాలో విడుదలైన యానిమేషన్ మూవీ 'నియు లై'.. ఈ మూవీని కేవలం రూ. లక్ష తోనే నిర్మించారు. చెత్త గ్రాఫిక్స్.. చెత్త స్టోరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమాపై ట్రోల్స్ చేశారు. అయితే కేవలం రూ. లక్షతో తీసిన ఈ మూవీ ఇప్పుడు కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది.

'నియు లై' అనే పేరుతో చైనాలో ఓ యానిమేషన్ సినిమా రిలీజైంది. దీని అర్థం అంటే ద కౌ ఈజ్ కమింగ్.. ఈ మూవీ 86 నిమిషాల రన్ టైమ్ ను కలిగి ఉంది. కేవలం ఇద్దరు వ్యక్తులు తల్లీకొడుకులైన షిన్ యుమెంగ్, సన్ లైఫాంగ్ లు దాదాపు 5 ఏళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించారు. అసలు ట్విస్ట్ ఏంటంటే..? ఈ సినిమాకు వాళ్లే రైటర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, వాయిస్ యాక్టర్లు కూడా. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఒక దూడ, ఒక స్కైలార్క్ పక్షి మధ్య జరిగే కలల ప్రయాణమే.. ఈ మూవీ ఆగస్టు 5 న ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా చైనాలో విడుదల అయింది. రిలీజ్ కు ముందు ఎలాంటి ప్రొమోషన్స్ చేయలేదు. కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. డైరెక్ట్ గానే 'నియు లై' సినిమాను విడుదల చేశారు.

రిలీజ్ తర్వాత ఈ మూవీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా వచ్చింది. చెత్త కంప్యూటర్ గ్రాఫిక్స్, ఎక్స్ ప్రెషన్స్ లేని క్యారెక్టర్లు, అర్థం కాని వాయిస్ ఓవర్ పై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు. 2026లోనే అత్యంత చెత్త సినిమా ఇదే అంటూ కామెంట్స్ వినిపించాయి. దాంతో ఈ సినిమాను ఇంత చెత్తగా ఎలా తీశారు..? స్వయంగా వెళ్లి చూద్దామని జనం ఇటీవల థియేటర్లకు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దాంతో థియేటర్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. మూవీ చూసిన ప్రతి ఒక్కరు అందులోని లోపాలను వెతికి నెట్టింట వైరల్ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకుల తాకిడి మరింత పెరిగింది. సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగిపోయాయి.

NiuLai animated movie is being dubbed the worst film of 2026 yet its box office collections shocks

ఈ నేపథ్యంలో మొదటి పది రోజుల్లో ఈ మూవీ కేవలం రూ. లక్ష వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టగా.. ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్ల వరకు వసూల్లు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద స్పైడర్‌ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఒడిస్సీ లాంటి హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి మరీ సత్తా చాటుతోంది. ఈ సినిమా రిజల్ట్ పై విశ్లేషకులు షాక్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+