పెంచిన తాజ్మహల్ సెక్యూరిటీ
ఆగ్రా : ప్రపంచంలో ఎనిమిదో వింతగా పేరెన్నికగన్న అద్భుత కట్టడం తాజ్‌మహల్. ఈ కట్టడానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచివుందన్న సమాచారం అందింది. దాంతో అధికారులు గట్టి భద్రతను కల్పించే ప్రయత్నాల్లో పడ్డారు. కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగానికి చెందిన సి.ఐ.ఎస్.ఎఫ్ జవాన్లు ప్రధాన ద్వారం వద్ద మొహరింప చేసారు. ఓ సీనియర్ సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారి శనివారం తాజ్ ని సందర్శించి భద్రతపై పూర్తి స్ధాయి ఎప్పిటికప్పుడు సమీక్ష అవసరమని తెలిపారు. దీని నిమిత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ ,ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా,సి.ఐ.ఎస్.ఎఫ్ వారు కలసి పనిచేస్తారు.తాజ్ లోపలి భద్రతను కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాలు పర్యవేక్షిస్తుండగా వెలుపలి భద్రతను ఉత్తరప్రదేశ్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications