'ఆరోగ్యాంద్రప్రదేశే' మా లక్ష్యం: వైయస్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట కర్నూలులో నిర్మించతలపెట్టిన ఐటీ సెజ్ కు శంకుస్థాపన చేసిన ఆయన తర్వాత అక్కడే జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఐటీని ప్రోత్సహిస్తున్నామని.. ఈరంగానికి కావాల్సిన అన్ని సహాయాలు అందిస్తున్నామని వైఎస్ వివరించారు. తర్వాత ఎమ్మిగనూరులో జరిగిన ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యాంద్రప్రదేశే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సిన అన్ని మేళ్లను చేస్తున్నామని, చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామని వైఎస్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications