రేడియాలజి పరిజ్ఞానంపై సదస్సు ప్రారంభం
విజయవాడ: ఇండియన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లు సంయుక్తంగా రేడియాలజి పై సదస్సు నిర్వహిస్తున్నాయి. రేడియాలజిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కోసం ఉద్దేశించిన ఈ రాష్ట్ర సదస్సు ఈ రోజే విజయవాడలో ప్రారంభం అయింది. నిమ్స్ మాజీ డైరక్టర్, రేడియోలజికల్ ఇమేజింగ్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు కాకర్ల సుబ్బారావు ఈ సదస్సు ప్రారంభించారు. వివిధ స్కానింగ్ పరికరాలు, పలు అరుదైన వ్యాధుల ఎక్స్‌రేలు. సిటీ స్కానింగ్, ఇమేజ్ ఫొటోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పేదలకు అధునాతన వైద్యం అందించడంలో ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని, ప్రైవేటు డాక్టర్లు కొంత మేరకే సహకరించగలరని కాకర్ల సుబ్బారావు తన ప్రసంగంలో తెలిపారు.












Click it and Unblock the Notifications