చిరంజీవి నాకంటే జూనియర్: విజయశాంతి
హైదరాబాద్:రాజకీయాల్లో చిరంజీవి తనకు జూనియర్ అని,అతనితో తనను పోల్చడం సమంజసం కాదని రాములమ్మ విజయశాంతి అబిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో ఎవరైనా ఆడుకోవాలని చూస్తే ఊరుకోమన్నారు. అలాగే తెలంగాణ ప్రజలతో ప్రజా రాజ్యం పార్టీ జాగ్రత్తగా వ్యవరించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని ఆ పార్టీని విజయ శాంతి హెచ్చరించారు.
అలాగే తెలంగాణ అనుకూలురులతో కలసి పనిచేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తల్లి తెలంగాణ పార్టీ అధినేత్ర విజయశాంతి ఆదివారం ప్రకటించారు. టీ ఆర్ ఎస్ తో ఉమ్మడిగా తెలంగాణ పోరు చేసేందుకు తాము సముఖంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. ఇక ప్రజారాజ్యం పార్టీతో కలసి పనిచేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణాకు తాము అనుకాలమని ప్రకటించిన టీడేపీనే ప్రజలు నమ్మేస్ధితిలో లేరని అటువంటిది పీ ఆర్పీని ఎందుకు నమ్ముతారు అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications