రాష్ట్ర ఉద్యోగుల తాత్కాలిక భృతి ఖరారు?
హైదరాబాద్ : రాష్ట్ర ఉద్యోగ ఉపాధి ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) మధ్యంతర భృతి కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 40 శాతం మధ్యంతర భృతి కోసం ముఖ్యమంత్రితో సమావేశమైన జెఎసి నేతలు కొంత బెట్టు దిగి 24 శాతానికి తగ్గేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే వైఎస్ మాత్రం 18 శాతానికి మించి ఇవ్వడం కష్టసాద్యమైన విషయమని వారికి వివరించినట్లుగా తెలుస్తున్నది.
గంటకు పైగా సాగిన చర్చల్లో మధ్యే పరిష్కారం లభించకపోవడంతో ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దసరా కానుకగా సాధ్యమైనంత వరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని వైఎస్ భావిస్తున్నారు. దీనితో మిగిలిన డిమాండ్ల పరిష్కారాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి మధ్యంతర భృతిపైనే దృష్టి సారించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న జెఎసి నేతలు కూడా కొంత బెట్టు వీడుతున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications