పాతబస్తీ ఎంఐఎం సొత్తు కాదు: పవన్ కళ్యాణ్

నిన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. తాను పర్యటించిన నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ తరఫున జిల్లాల పర్యటనలు చేస్తానన్నారు.
పర్యటనలో 'చిరు' భద్రత కోసం 500 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. తాను పర్యటించిన నియోజకవర్గాల్లో అన్నిచోట్లా జెండావిష్కరణతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ పరిశీలించానన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, గోషామహల్, బహదూర్‌పురా, కార్వాన్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో బుధవారం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications