చెన్నై-సికింద్రాబాద్ మధ్య ఎక్స్ ప్రెస్ కారిడార్
విశాఖపట్నం: ప్రయాణీకుల రవాణా, సరుకుల రవాణాకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌కేసీ జనా తెలిపారు. సికింద్రాబాద్, చెన్నైల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ కారిడార్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. సరుకుల రవాణాకోసం తూర్పు,పశ్చిమ కారిడార్లను కలుపుతూ విశాఖ మీదుగా మరో కారిడార్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు.
దేశంలోని వివిధ పోర్టులను అనుసంధానిస్తూ వీటతిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. లూథియానా, కోల్‌కతాల మధ్య తూర్పు, ముంద్రానుంచి ఢిల్లీ వరకు పశ్చిమ కారిడార్‌ను కలుపుతూ విశాఖ మీదుగా మరో కారిడార్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం జపాన్ 450 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications