ఉండవల్లి ఆరోపణలను కొట్టేసిన బాబు

ఈ నెల 5వ తేదీన గుంటూరులో జరిగే యువగర్జన సదస్సు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నిమజ్జనం తప్పదని ఆయన అన్నారు. తాము గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువగర్జన సదస్సు ద్వారా ప్రభుత్వ అవినీతిపై యువత యుద్ధం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. 230 సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో 23, 30 సీట్లకు మధ్యనే వస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వం అవినీతిపై ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనైనా ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జవాబు చెప్పక తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications