తెలంగాణపై స్పష్టంగానే చెప్పా: చిరు

ఉపాధ్యాయుల సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. తాము ఉపాధ్యాయులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అన్ని పార్టీలు కోరుతున్నా ప్రభుత్వానికి స్పందన లేదని ఆయన అన్నారు. చిరంజీవి కాన్వాయ్ ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఎంఆర్పీయస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సీ వర్గీకరణపై వైఖరిని వెల్లడించాలని ఎంఆర్పీయస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారితో మాట్లాడుతానని చిరంజీవి ప్రకటించడంతో వారు నిరసనను ఉపసంహరించుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చేయాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేశారు.
సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సహకరిస్తామని, ఇంతకన్నా ఏం స్పష్టత కావాలని ఆయన అన్నారు. నిన్న మొన్న వచ్చిన తాను స్పష్టంగా చెప్పానని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాళ్లు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తాను స్పష్టమైన వైఖరినే వెల్లడించానని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం కోసమే ప్రజారాజ్యం పార్టీ వచ్చిందని ఆయన చెప్పారు. సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాలని ఆయన అన్నారు. ప్రజాభీష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్దామని ఆయన అన్నారు. ప్రజాశీస్సులతో తమ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications