మనపై సంక్షోభ ప్రభావం: ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్‌ను తాకుతోందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. సోమవారంనాడు ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కుప్పకూలుతున్నామన బ్యాంకులు క్షేమంగానే ఉన్నాయని, డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 'సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత మనం మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి. పరిస్థితి బాగాలేదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి' అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో రతన్‌టాటా, ముఖేష్‌ అంబానీ, కె.వి.కామత్‌, శశిరూయా, దీపక్‌పరేఖ్‌, కె.పి.సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం, ఆర్బీఐ గవర్నర్‌ సుబ్బారావు, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తలు లేఆఫ్ ల వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ప్రధాని సూచించారు. ప్రస్తుతం ప్రపంచ సంక్షోభాన్ని తట్టుకోవడానికి తగిన విధంగా వ్యవహరిస్తూనే సామాజిక బాధ్యతలను పరిశ్రమలు దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడం మన ప్రథమ కర్తవ్యం కావాలని ఆయన అన్నారు. పరిస్థితి అసాధారణంగా ఉందని, మనం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, రోజూవారీ ప్రాతిపదికపై పరిస్థితులను సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+