ఆర్టీసి కార్మికుల సమ్మె నోటీసు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. గుర్తింపు పొందిన ఆర్టీసి కార్మికుల సంఘం ఎన్ఎంయు ఈ సమ్మె నోటీసు ఇచ్చింది. 1500 సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంఘం ఈ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ తర్వాత సమ్మె తేదీన నిర్ణయించుకోనున్నట్లు సంఘం నాయకులు చెప్పారు. మొదటి విడత 750 సెట్విన్ బస్సులను, మలి విడత మరో 750 సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలపెట్టింది.
సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టడమంటే ఆర్టీసి ప్రైవేట్ పరం చేయడమేనని సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. ఆర్టీసిని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారంటున్నారు. తమతో సమ్మెకు కలిసి రావాలని ఎన్ఎంయు ఇతర కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మె వల్ల దెబ్బ తింటుందని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications