త్వరలో రోజుల్లో సిపిఐతో చర్చలు: సిపిఎం

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నాలుగైదు రోజుల్లో సిపిఐతో చర్చిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. పొత్తులపై తమ ఇరుపార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకునే విడిపోతాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే నడుస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఓటమి, జాతీయ కూటమిలో కలిసిరావడం అనే ప్రాతిపదికలపై వచ్చే ఎన్నికల్లో పొత్తులను ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో పొత్తులు పెట్టుకునే విషయంపై ఆదివారం ముగిసిన సిపిఐ జాతీయ కార్యవర్గం సమావేశాల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. పొత్తులు ఖరారు విషయాన్ని జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకే వదిలేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సిపిఐ షాక్ కు గురైంది. సిపిఐ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో సిపిఎం నిర్ణయం వెలువడడం ఆ షాక్ కు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+