ఉపాధ్యాయుల సమ్మె విరమణ
హైదరాబాద్: ఉపాధ్యాయులు గత 13 రోజులుగా చేస్తున్న సమ్మెను సోమవారంనాడు విరమించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఉపాధ్యాయులు సమ్మెను విరమిస్తున్నట్లు ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి (జాక్టో)నాయకులు తెలిపారు. రేపటి నుండి విధులకు హాజరవుతామని వారు చెప్పారు. అయితే సమ్మె విరమణను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. యుటిఎఫ్, డిటిఎఫ్ సమ్మె విరమణను వ్యతిరేకిస్తున్నాయి.
ఉపాధ్యాయుల సమస్యలను వచ్చే ఏడాది ఏప్రిల్ లో పరిష్కరిస్తామని పాఠశాల విద్యా మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు సమ్మె చేసిన 13 రోజులను స్పెషల్ లీవ్ గా పరిగణిస్తామని ఆయన చెప్పారు. తాము అసంతృప్తితోనే సమ్మెను విరమిస్తున్నట్లు జాక్టో నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications