కాంగ్రెస్ పదవికి ఆల్వా రాజీనామా
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి పదవికి మార్గరెట్ ఆల్వా రాజీనామా చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆల్వా రాజీనామా చేశారు. ఈ వివాదంపై ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
అల్వా రాజీనామాను పార్టీ ఆమోదించిందా లేదా అనేది తెలియరావడం లేదు. ఆరోపణలకు గాను క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పార్టీ నాయకత్వం సోమవారం ఆల్వాను హెచ్చిరించింది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిసిన అనంతరం తాను రాజీనామా చేసినట్లు ఆల్వా ప్రకటించారు.












Click it and Unblock the Notifications