డిఎస్ ఇంట్లో సీనియర్ల విందు భేటీ

ఎన్నికల వ్యూహంపై చర్చించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ముందు కూడా ఇటువంటి సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చించలేదని, ఎన్నికల వ్యూహంపై మాత్రమే చర్చించామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తాము కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన ప్రకటనపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తెలంగాణ అంశాన్ని తాము పార్టీ అధిష్ఠానవర్గానికి వదిలేశామని, అధిష్ఠానమే ఆ విషయాన్నిచూసుకుంటుందని ఆయన అన్నారు.
అయితే, సమావేశంలో తెలంగాణపై విస్తృతంగానే సమావేశం జరిగినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి అప్పగించినందున ఆ అంశంపై పార్టీ నాయకులెవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. దీనికి హనుమంతరావు, వెంకటస్వామిగా ధీటుగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఆంధ్ర నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని, వారు మాట్లాడినప్పుడు తాము మాట్లాడకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే తాము మాట్లాడాల్సి వస్తోందని, ఈ విషయంలో తాము క్రమశిక్షణను ఉల్లంఘించడం లేదని వారు చెప్పినట్లు సమాచారం. విందు సమావేశం జరిగిన తర్వాత డి. శ్రీనివాస్ తో జి. వెంకటస్వామి, హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు విడిగా సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications