శీను శవం రీపోస్టుమార్టంపై హైడ్రామా
గుంటూరు: అనంతపురం జైల్లో హత్యకు గురైన మొద్దు శీను మృతదేహానికి గుంటూరు ఆస్పత్రిలో రీపోస్టుమార్టం చేసే విషయంపై హైడ్రామా నెలకొంది. రీపోస్టుమార్టం చేసే గదిలోకి తమని కూడా అనుమతించాలని మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం పట్టుబట్టారు. ఆమెతో పాటు మొద్దు శీను బంధువులు ఆందోళనకు దిగారు. అయితే తమకు అలాంటి ఆదేశాలేమీ లేవని, అందువల్ల పోస్టుమార్టం గదిలోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. తాము పై అధికారులను సంప్రదించి వారు ఆదేశిస్తే అనుమతిస్తామని చెప్పి రీపోస్టుమార్టం ప్రక్రియను నిలిపేశారు.
మానవహక్కుల కమిషన్ జోక్యం, మొద్దుశీను బంధువుల ఆందోళన, కోర్టు ఆదేశాలు కలిసి ఎట్టకేలకు మొద్దుశీను రీపోస్ట్‌మార్టంకు మార్గం సుగమమైంది. ఈరోజు ఉదయం శీను మృతదేహాన్ని అతని స్వగ్రామం చల్లగుండ్లనుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టగానే శీను భార్య లక్ష్మీరాజ్యం, ఇతర బంధువులు అడ్డుకున్నారు. తమను కూడా పోస్ట్‌మార్టం దగ్గరకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రం కావటంతో డాక్టర్లు పోస్ట్‌మార్టంను నిలిపివేశారు. ఆసుపత్రి అధికారులు దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. వారు అనుమతి ఇస్తే లోపలకు రానిస్తామని శీను బంధువులకు చెప్పారు.












Click it and Unblock the Notifications