శీను హత్యపై విలిపించిన సూరి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యకేసులో మంగళవారం మద్దెలచెరువు సూరి జిల్లా సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నిందితులను కూడా కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆవరణలో సూరి అతని అనుచరులు శీను అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం జడ్జి ముందు శీను హత్యపై మాట్లాడుతూ భోరున విలపించాడు. శీను హత్యలో జైలు అధికారుల ప్రమేయంపై వివరించేందుకుతనకు సమయం ఇవ్వాలని సూరి జడ్జిని కోరాడు.
మొద్దు శీను హత్యలో జైలు సిబ్బంది పాత్రపై తాను న్యాయవాదికి వివరిస్తానని సూరి చెప్పాడు. మొద్దు శీను హత్యలో జైలు సిబ్బంది ప్రమేయం ఉందని పరిటాల హత్య కేసులో మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అన్నాడు. పరిటాల రవి హత్య కేసులోని నిందితులను వేర్వేరు బ్యారక్ ల్లో ఉంచాలని ఆయన న్యాయమూర్తిని కోరాడు. మొద్దు శీను హంతకులను ఎవరినీ వదిలిపెట్టబోమని అతను అన్నాడు. పరిటాల రవి హత్య కేసు నిందితులను కోర్టుకు హాజరుపరిచే సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను ప్రధాన ద్వారం నుంచి కాకుండా వెనక గల ద్వారం నుంచి లోనికి తీసికెళ్లారు. లోనికి మీడియా ప్రతినిధులను కూడా రానీయలేదు.












Click it and Unblock the Notifications