పెట్రో,డీజిల్ ధరలు తగ్గవు: ప్రధాని

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే చమురు కంపెనీలు తట్టుకోగలిగే పరిస్థితి ఉంటేనే ధరల తగ్గింపుపై ఆలోచన చేస్తామని ఆయన సోమవారం రాత్రి భారత్ కు తిరిగి వస్తూ విమానంలో విలేకరులతో చెప్పారు. పెట్రోల్ అమ్మకాలపై చమురు కంపెనీలకు లాభం వస్తోందని, అయితే డీజిల్ అమ్మకాలపై ఇంకా నష్టాలు వస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం పెట్రోల్ పై లీటరుకు రు.4.12 పైసల లాభాన్ని ఆర్జిస్తున్నాయని, డీజిల్ పై లీటరుకు 96 పైసల నష్టం వస్తోందని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజిపై 128 కోట్లు రూపాయలు, కిరోసిన్ పై 135 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఒక అంచనా.












Click it and Unblock the Notifications