ఒబామా ప్రయత్నించారు: ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా తనతో మాట్లాడడానికి ప్రయత్నించారని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. అయితే సమయం కుదరకపోవడం వల్ల, తాను ప్రయాణంలో ఉన్నందున మాట్లాడలేకపోయినట్లు ఆయన తెలిపారు. ఒబామా తనను పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

ఒబామా ఈ నెల 8వ తేదీన తనతో మాట్లాడడానికి ప్రయత్నించారని, అయితే తగినంత సమయం లేకపోవడం వల్ల మాట్లాడడం కుదరలేదని ఆయన చెప్పారు. అప్పటి నుంచి తాను ప్రయాణంలో ఉన్నానని, తాను భారత్ కు తిరిగి వెళ్లిన వెంటనే మాట్లాడుతానని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాటు 15 మంది ప్రపంచ నేతలతో ఫోనులో మాట్లాడిన ఒబామా మన్మోహన్ సింగ్ తో మాత్రం మాట్లాడలేదని వార్తలు వచ్చాయి.

అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందే ఒబామా తనకు సాదరపూర్వకమైన లేఖ రాశారని మన్మోహన్ సింగ్ చెప్పారు. తాను కూడా ఒబామాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆయన ఆశించారు. ప్రధాని ఓమన్, ఖాతర్ పర్యటనల్లో ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+