జెడియు ఎంపీల రాజీనామాల ఆమోదం
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన 5గురు జేడీయు ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ మంగళవారం ఆమోదించారు. మహారాష్ట్రలో ఉత్తరాదివారిపై జరుగుతున్న దాడులకు నిరసనగా జేడీయు ఎంపీలు 5గురు ఇటీవల స్పీకర్‌కు రాజీనామా లేఖలు ఇచ్చారు. ప్రభునాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కైలాస్ భైతా, మీనా సింగ్, జార్జి ఫెర్నాండెజ్ శుక్రవారంనాడు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు అందజేశారు.
ముంబయిలో దాడులపై వోటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులుడిగి ఉన్నారని, కేంద్ర మంత్రి శరద్ పవార్ ఒత్తిడి మేరకే ప్రధాని పనిచేస్తున్నారని ఆ ఐదుగురు విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపిల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.












Click it and Unblock the Notifications